పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన యశస్వీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా యువతను ఆకట్టుకునే ప్రోమోలతో ఇప్పటికే ఈ చిత్రం హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. టీజర్, ట్రెయిలర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది. రేపు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో దర్శకుడు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ముందే పూర్తి అయిందని పేర్కొన్న ఆయన పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా సినిమా డిలే అవుతూ వచ్చిందని అలా అవడానికి కారణం రధన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ అని అన్నారు.
Also Read: Kalki 2898 AD : ‘కల్కి’ వాయిదా పై మరోసారి వార్తలు.. వచ్చేది అప్పుడే ?
ఈ విషయం తాను చెప్పాల్సిందే అని ఎందుకంటే తనలాగా ఎవరూ మోసపో కూడదని అన్నారు. అతను అద్భుతమైన టెక్నీషియన్, నేను కాదు అనడం లేదు. మనం అలా అనుకుని అక్కడికి వెళ్లి పోతున్నాము కానీ అతని చేతిలో పడి సినిమా నలిగిపోతోంది. అతను గొడవ పడడానికి మాత్రమే మాట్లాడతాడు. ఒక ఉదాహరణ చెబుతాను, అతన్ని కలవడానికి చెన్నై వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే రేపు రేపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈలోపు మేము లొకేషన్ రెక్కీ కోసం విశాఖ వెళుతుంటే రాజమండ్రిలో అతని నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ అయ్యే సరికి వైజాగ్ వచ్చింది, అతను ఎంత వాదిస్తాడు అనేదానికి ఇది ఉదాహరణ అని అన్నారు. అతను ఎంత మంచి మ్యూజిక్ చేస్తాడు అనే విషయం పక్కన పెడితే సినిమాను ఒక పక్కకు తీసుకు పోయి వదిలేస్తాడు. అతను చెన్నైలో ఉండి బతికిపోయాడు లేదంటే ఇక్కడ ఉంటే చాలా గొడవలు అయ్యేవి అని కామెంట్ చేశారు.