NTV Telugu Site icon

Siddarth: తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.. వీడియో రిలీజ్ చేసిన హీరో సిద్దార్థ్

Revanth Reddy Siddarth

Revanth Reddy Siddarth

Siddharth Releases a Video against Drugs and Supports Revanth Reddy: కమల్ హాసన్ హీరోగా సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, సముద్రఖని, బ్రహ్మానందం వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం భారతీయుడు 2.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా టీం ఈ ఉదయం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రతి నటుడు, నటి సామాజిక బాధ్యతతోనే ఉంటారు. మాకు ఉన్న సామాజిక స్పృహ నేపథ్యంలో మేం చేయగలిగింది మేం చేస్తాం .ముఖ్యమంత్రి మమ్మల్ని ఏమైనా కావాలని కోరితే మేము చేస్తాం. ఏ సీఎం కూడా మీరు ఇది చేస్తేనే మీకు అది చేస్తామని చెప్పలేదు అంటూ సిద్దార్థ్ కామెంట్ చేశారు. అయితే సిద్ధార్థ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సిద్ధార్థ విడుదల చేసిన ఒక వీడియోని బండ్ల గణేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతీయుడు సినిమాలో మేము జీరో టోలరెన్స్ గురించి మాట్లాడుతున్నాము అవినీతి గురించి జీరో టోలరెన్స్ డ్రగ్స్ కి వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ అలాంటి భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్ లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు మా మాటల్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.

Mahesh Babu: కల్కి 2898 ఏడీ సినిమాకి మహేష్ బాబు లేట్ రివ్యూ

ఆ తప్పుగా అర్థం చేసుకున్న దాన్ని నేను వెంటనే క్లియర్ చేసేయాలి. నేను పూర్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నాను అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ని కూడా సపోర్ట్ చేస్తున్నాను. డ్రగ్స్ విషయంలో వాళ్ళు చేస్తున్న ఫైట్ ని కచ్చితంగా అందరం సపోర్ట్ చేసి తీరాల్సిందే. మన పిల్లల భవిష్యత్తు వాళ్ల చేతుల్లోనే కాకుండా మన చేతిలో కూడా ఉంది. వాళ్ళ ఫ్యూచర్ ని కాపాడుకోవడం మన కర్తవ్యం. నేను 100% చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో ఉన్నాను. డ్రగ్స్ ని అరికట్టాలని రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నేను నా మద్దతు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ తో కలిసి సినీ పరిశ్రమ కూడా బెటర్ సొసైటీ కోసం కష్టపడాలని ఆయన ఆలోచనను మెచ్చుకుంటున్నాను. నా కెరీర్ మొత్తంలో నేను సామాజిక విషయాల్లో నా వంతు సహాయం నేను చేస్తా. నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. నేను మధ్యాహ్నం అన్నది మమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు. మేము మా అంతటా మేమే ముందుకు వచ్చి చేస్తున్నాం అని. ఈ విషయంలో డ్రగ్స్ మీద పోరాడుతున్న రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అన్నారు.

సిద్దార్థ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Show comments