NTV Telugu Site icon

Syam Benagal : ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Syan Benegal Death

Syan Benegal Death

భారతీయ సినిమా ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ మరణించారు. శ్యామ్ బెనెగల్ 23 డిసెంబర్ 2024న తుది శ్వాస విడిచారు. శ్యామ్ బెనెగల్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం 6:00 గంటలకు శ్యామ్ బెనగల్ ఈ లోకానికి శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. శ్యామ్ బెనగల్ మరణవార్తతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అందుతున్న సమాచారం సమాచారం ప్రకారం, ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో శ్యామ్ బెనెగల్ సాయంత్రం 6.30 గంటలకు తుది శ్వాస విడిచారు. మంగళవారం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Daaku Maharaj: చిన్ని అంటూ సాంగేసుకున్న డాకు మహారాజ్

ఆయన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆయన 50 సంవత్సరాలకు పైగా పరిశ్రమలో సుదీర్ఘ ప్రయాణం చేశారు. శ్యామ్ సుందర్ బెనెగల్ 1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సినిమా ప్రపంచంలోకి రాకముందు ఎకనామిక్స్ చదివిన తర్వాత ఆయన ఫోటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు. బాలీవుడ్ ప్రపంచంలో, ఆయన సినిమా ఆర్ట్ కి పితామహుడిగా కూడా పరిగణించబడతారు. హిందీ చిత్ర పరిశ్రమ వైపు మళ్లడానికి ముందు, ఆయన అనేక యాడ్ ఏజెన్సీలలో పనిచేశాడు. ‘అంకుర్’ సినిమాతో బాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్యామ్. ఆ మొదటి సినిమా 43 అవార్డులను గెలుచుకుంది. దీని తర్వాత ‘మంథన్’, ‘కలిగ్’, ‘నిశాంత్’, ‘ఆరోహణ్’, ‘జునూన్’ వంటి ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను రూపొందించాడు.

Show comments