హాట్ బ్యూటీ శృతి హాసన్ ఈ లాక్ డౌన్ ను ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. ప్రముఖ ఆర్టిస్ట్ శాంతను హాజరికతో కలిసి ఉన్న పిక్స్ ను షేర్ చేసింది శృతి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించకపోయినా… వారు షేర్ చేసే ఫోటోలు చూసి జనాలు అలా ఫిక్స్ అయిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శాంతను మాట్లాడుతూ వృత్తిపరంగా తాము మంచి స్నేహితులమని, చాలా అభిప్రాయాలు కలిశాయని చెప్పుకొచ్చాడు. అయితే వ్యక్తిగత విషయాలు చర్చించాలనుకోవట్లేదు అంటూ ప్రేమ ప్రశ్నలపై సమాధానాన్ని దాటవేశారు. అప్పటి నుంచి వీరిద్దరూ లవ్ లో ఉన్నారనే అనుకుంటున్నారు. ఇక విషయానికొస్తే… తాజాగా శాంతనుతో కలిసి శృతి షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. నా బెస్టీతో లాక్డౌన్‌లో ఇలా… అంటూ ఈ పిక్స్ ను షేర్ చేసింది శృతి.
లాక్ డౌన్ లో ప్రియుడితో శృతి హాసన్… పిక్స్ వైరల్
