వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాలలో మరింత జోరు పెంచిన క్రమంలో తాజాగా పాత్రికేయుల సమావేశం నిర్వహించింది హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
UI Movie : “యూఐ” మూవీకి సంబంధించిన ఆ వార్తలన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన యూనిట్
బాలకృష్ణ సెట్ లో ఎలా ఉండేవారు అని అడిగితే ఆమె మాట్లాడుతూ ఈ రూమ్ లో ఉన్న అందరి ఎనర్జీ ఎంత ఉంటుందో ఆయన ఎనర్జీ ఒక్కటే అంత ఉంటుంది. ఆయన చాలా ఫ్రెండ్లీ. నాకు మొదటి రోజు గుర్తు ఉంది, నేను చెప్పాల్సిన డైలాగ్ పెద్దది, నేను కూర్చుని దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆయన వచ్చి శ్రద్దా రా అని పిలిచారు. నేను ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే ఆ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ బిహేవియర్ వదిలేయ్. సరదాగా ఉండు అన్నారు. నేనే లేదు ఇది నా సొంత బాష కాదు కదా ప్రాక్టీస్ చేయాలి, అందరూ నా వల్ల ఇబ్బంది పడొద్దు అని అన్నానని అన్నారు. అలాగే ఆయనని నేను సార్ అంటే ఆయన మాత్రం బాలా అనే పిలవమన్నారు. అప్పటి నుంచి నేను సార్ అన్నప్పటి నుంచి ఆయన ఆ సార్ ఆ అని అంటూ ఉండేవారు. ఇంకేం పిలవాలి, ఆయన్ని బాలా అని పిలవడం అంటే నాకు భయం అని శ్రద్దా శ్రీనాధ్ అన్నారు.