బాలీవుడ్‌లో తనదైన నటనతో, ప్రతిసారీ కొత్త ప్రయోగాలకు సిద్ధపడే నటి శ్రద్ధా కపూర్. కానీ శ్రద్ధా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ, ఆమెకు ఇంకా సరైన స్థాయి గుర్తింపు రాలేదని చెప్పాలి. అలియా భట్, దీపికా పదుకొణె వంటి హీరోయిన్స్‌కు లభించిన మద్దతు ఆమెకు దక్కలేదని, బాలీవుడ్‌లో ఆమె తన స్థానం కోసం నిశ్శబ్దంగా పోరాడుతోంది. ఇక తెలుగు ప్రేక్షకులకు ‘సాహో’ చిత్రంతో పరిచయమైన శ్రద్ధా.. ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రాజెక్టులో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే మూవీస్ విషయం పక్కన పెడితే, తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్ అయింది. ప్రేమనూ, వేదనను కలగలిపి నట్లు కనిపించిన ఆమె కవితా పదాలు.. అభిమానుల మనసులో ఏదో ప్రత్యేకమైన స్పందనను కలిగిస్తున్నాయి.
Also Read : Adah Sharma : అద్దె ఇంట్లో అవస్థలు పడుతున్న పూరీ హీరోయిన్..!
‘నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు..నేను నీ పక్కన కూర్చుంటాను. నువ్వు విచారంగా ఉన్నప్పుడు..నేను నిన్ను దగ్గరికి తీసుకోడానికి వస్తాను. నువ్వు తప్పిపోతావని నాకు తెలుసు..నువ్వు పారిపోతావనీ తెలుసు..కానీ, నేను నిన్ను కచ్చితంగా కనుక్కుంటాను.నిన్ను ఇక్కడే ఉండేలా చేస్తాను..’ అంటూ రాసుకొచ్చింది. ఈ లైన్లు చూసిన నెటిజన్లు మిక్స్డ్ రియాక్షన్లతో స్పందిస్తున్నారు. కొందరైతే ఇది ఆమె వ్యక్తిగత జీవితం లోని భావోద్వేగాల ప్రతిఫలమని భావిస్తున్నారు. ఇటీవల సినీ రచయిత రాహుల్ మోడీతో శ్రద్ధా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి గురించి ఊహాగానాలు కూడా వినిపించగా, ఈ పోస్ట్ తో ఈ రూమర్స్ మరింత భలంగా వినపడుతున్నాయి. ఏదేమైనా.. శ్రద్ధా మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచనలో ముంచేలా చేస్తున్నాయి!
