Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. స్టార్ దర్శకుడితో సినిమా డౌటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల విషయంలో కాస్త తర్జన భర్జనలు నడుస్తున్నాయి. గతంలో అధికారికంగా ప్రకటించిన రెండు భారీ చిత్రాలు ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిలింనగర్ వర్గాల సమాచారం. వీటికి బదులుగా, మోస్ట్ అవేటెడ్ సీక్వల్ ‘OG 2′ అనూహ్యంగా ముందుకు వచ్చింది. దీనివల్ల ఇద్దరు స్టార్ డైరెక్టర్ల ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది.
వాస్తవంగా పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ సినిమా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. రామ్ తాళ్లూరి నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే అనౌన్స్ అయ్యింది. అయితే ఈ సినిమా ఇప్పటికీ స్క్రిప్ట్ దశలోనే ఉండటం సరైన క్లారిటీ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కకు పెట్టినట్టు సమాచారం. మరోవైపు ‘OG’ తర్వాత దర్శకుడు సుజిత్.. నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ‘బ్లడీ రోమియో’ అనే చిత్రాన్ని చేయాల్సి ఉంది. కానీ నాని ప్రస్తుతం చేస్తున్న ‘ది పారడైస్’ మూవీ డిలే కావడంతో, ‘బ్లడీ రోమియో‘ వెనక్కి వెళ్లిపోయింది. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న మేకర్స్ ముందుగా ‘OG 2’ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు మొగ్గు చూపుతున్నారట. పవన్ కళ్యాణ్ కూడా ఈ సీక్వల్ కథపై చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘OG 2’ కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితేఈ ఏడాది సెప్టెంబర్‌లో అందుకు సంబంధించి అధికారిక అనౌన్స్మెంట్ రానుంది. అలాగే నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 చివరి నాటికి థియేటర్లలోకి తీసుకురావడమే లక్ష్యంగా మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘OG 2’ తర్వాత సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!