NTV Telugu Site icon

Urvashi Rautela: ‘డాకు మహారాజ్’ వివాదంలో ఊర్వశి.. సైఫ్ కి క్షమాపణలు

Urvashi Daku

Urvashi Daku

బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ అనూహ్యంగా ఇంట్లో కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు దొంగగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఇంట్లో జొరబడి సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేయగా అతన్ని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. సర్జరీ చేసి వెన్నుముక దగ్గర విరిగిపోయిన కత్తిని తొలగించిన డాక్టర్లు ప్రస్తుతానికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్ల విషయంపై స్పందిస్తున్న సమయంలో నటి ఊర్వశి అనూహ్యంగా వివాదంలో చిక్కుకుంది. అందరినీ అడిగినట్టే ఆమెను కూడా సైఫ్ అలీ ఖాన్ మీద దాడి గురించి స్పందన కోరారు. అయితే ఆమె సైఫ్ అలీ ఖాన్ మీద దాడి గురించి స్పందించకుండా తాను తెలుగులో డాకు మహారాజ్ అనే సినిమాతో 100 కోట్ల సినిమా అందుకున్నానని ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కారణంగా తన తల్లి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిందని, తండ్రి ఒక రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడని అంటూ మాట్లాడుతూ వచ్చింది.

SS Thaman: జీవితాంతం బాలయ్యకు రుణపడి ఉంటా!

దీంతో సైఫ్ అలీ ఖాన్ అభిమానులతో పాటు నెటిజన్లు ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విషయం అర్థం చేసుకున్న ఆమె ఏకంగా సైఫ్ అలీ ఖాన్ ని ఉద్దేశిస్తూ ఒక సుదీర్ఘమైన క్షమాపణ లేఖ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. హృదయపూర్వకంగా తాను క్షమాపణలు చెబుతున్నానని ఆమె అన్నారు. తనకు ఇప్పటివరకు సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి విషయంలో సీరియస్ నెస్ అర్థం కాలేదని ఆమె చెప్పుకొచ్చారు. తన మీద తనకే సిగ్గుగా ఉందని డాకు మహారాజు సక్సెస్ కావడంతో తనకు వచ్చిన గిఫ్టుల గురించి మాట్లాడటం కరెక్ట్ అని అనిపించడం లేదని చెప్పుకొచ్చారు. మీ గురించి అడిగితే మాట్లాడకుండా డాకు మహారాజ్ సక్సెస్ కారణంగా తాను దాని గురించి మాట్లాడానని చెప్పుకొచ్చింది. దయచేసి నా క్షమాపణలు స్వీకరించండి, మీ విషయంలో నేను చాలా మూర్ఖంగా ఇన్ సెన్సిటివ్గా వ్యవహరించాను. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా, నా తరఫునుంచి ఏమైనా సహాయం కావాలంటే అడగడానికి ఏమాత్రం సంకోచించవద్దు. మీ గురించి అడిగితే డాకు మహారాజు గురించి మాట్లాడినందుకు మరోసారి క్షమించండి అంటూ ఆమె చెప్పుకొచ్చింది.