Shivathmika: నేను హీరోయిన్‌గా చేస్తే సినిమా చెయ్యను అన్నాడు.. శివాత్మిక రాజశేఖర్ కామెంట్స్ వైరల్!

Shivathmika Rajasekhar

Shivathmika Rajasekhar

Shivathmika: టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ‘అ’ సినిమా వేడుకలో రాహుల్ విజయ్‌ను ఉద్దేశించి శివాత్మిక చేసిన సరదా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. “నేను హీరోయిన్‌గా చేస్తే రాహుల్ సినిమా చెయ్యను అన్నాడు” అంటూ ఆమె సరదాగా చేసిన కామెంట్ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన శివాత్మిక, వేదికపై మాట్లాడుతూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ విజయ్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ.. “గతంలో నేను హీరోయిన్‌గా నటిస్తే ఆ సినిమా చెయ్యనని రాహుల్ సరదాగా చెప్పాడు” అంటూ నవ్వులు పూయించారు. వారిద్దరి మధ్య ఉన్న క్లోజ్ ఫ్రెండ్‌షిప్, బాండింగ్ వల్లే రాహుల్ అలా అన్నాడంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు.

రాహుల్ ఎంతో టాలెంట్ ఉన్న నటుడని, మంచి డ్యాన్సర్ మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఎంతో మంచి మనసున్న వ్యక్తని శివాత్మిక కొనియాడారు. రాహుల్ విజయ్‌తో కలిసి ఇప్పటికే మూడు ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం వచ్చిందని, ఆయన ఫ్యామిలీతో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఈ సినిమా కేవలం రాహుల్ కోసమే తాను ఇక్కడికి వచ్చానని స్పష్టం చేస్తూ, ఈ ప్రాజెక్ట్ అతనికి పెద్ద విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ వేదికపై ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులపై కూడా శివాత్మిక ప్రశంసలు కురిపించారు. సినిమాలోని విజువల్స్, టీజర్, పాటలు చాలా బాగున్నాయని చెప్పారు. సీనియర్ నటుడు శ్రీకాంత్‌తో ‘గుణ 369’ సమయంలో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎప్పటికీ ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని అని పేర్కొన్నారు. అలాగే హీరోయిన్ అర్చన అందం, డ్యాన్స్ చాలా బాగున్నాయని కితాబిచ్చారు. వేదికపై స్నేహపూర్వకంగా, సరదాగా అన్నప్పటికీ.. “నేను హీరోయిన్‌గా చేస్తే రాహుల్ సినిమా చెయ్యను అన్నాడు” అంటూ శివాత్మిక చేసిన ఈ ఒక్క కామెంట్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.