Site icon NTV Telugu

Shivangi : ఎలాంటి అప్ డేట్ లేకుండా.. సైలెంట్ గా OTT లోకి ‘శివంగి’

Teja Sajja,'mirai',daggubati Rana,

Teja Sajja,'mirai',daggubati Rana,

యంగ్ హీరోయిన్ ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘శివంగి’. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ థ్రిల్లర్ మూవీలో ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు అందించారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది.

Also Read: Coolie : ‘కూలీ’ తెలుగు హక్కుల కోసం భారీ డిమాండ్..

ఇందులో భాగంగా తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా ఈ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘శివంగి’ మూవీ గురువారం నుంచి అంటే నేటి నుండి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా ఓటీటీ సంస్థ వెల్లడించింది.. అలాగే ‘ఒకరోజు. జీవితాంతం పోరాటం. సత్యభామ కథ మిమ్మల్ని ప్రతిదానికి ప్రశ్నించేలా చేస్తుంది. అది హత్యా లేక ఆత్మహత్యా?’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Exit mobile version