NTV Telugu Site icon

Shivaji: ఈ మంగపతి గుర్తుండిపోతాడు..!

Shivaji

Shivaji

హీరో శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అనంతరం అవకాశాలు తగ్గడంతో ఆయన సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కొన్ని సంవత్సరాలు ఆయన కృషి చేశారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ షో ద్వారా ఆయన వ్యక్తిత్వం చూసి అనేకమంది ఈ జనరేషన్ కిడ్స్ కూడా ఆయనకు అభిమానులు గా మారిపోయారు.

Also Read: Sudheer Babu : చిక్కుల్లో పడిన ‘జటాధర’..?

ఇక ఈ షో నుండి బయటకు వచ్చిన తర్వాత ‘#90స్’ అనే వెబ్ సిరీస్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి శివాజీ తాజాగా నాని నిర్మాతగా రామ్ జగదీష్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో రూపొందించిన ‘కోర్ట్’ అనే సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. ఈ మూవీ మర్చి 14న విడుదల కానుంది. కానీ తాజాగా ఈ సినిమాను మీడియాకు రెండు రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ వేశారు. కాగా ఈ మూవీ లో మంగపతి అనే పాత్రలో శివాజి నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్పవచ్చు. స్క్రీన్ మీద శివాజీ కనపడిన ప్రతిసారీ ఆయన నటన, ఆయన డైలాగ్ డెలివరీకి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అంతేకాక ఒక్కోసారి శివాజీ నటన చూసి చప్పట్లు చరుస్తూ అభినందిస్తున్నారు. అంటే దీని బట్టి ఆయన ఆ పాత్రలో ఎంతగా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు. విశ్లేషకులు సైతం తమ రివ్యూస్ లో శివాజీ నటన గురించి ప్రస్తావిస్తున్నారు. సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడం అందరూ చేస్తున్నారు. కానీ ఇలాంటి ఒక సాలిడ్ పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వడం శివాజీకే చెల్లిందేమో. శివాజీ పాత్రకు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వడం పక్క. ఇక ఈ పాత్ర దెబ్బతో శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ లో మరికొన్ని పాత్రలు లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.