గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో, గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని.. వెంకట సతీష్ కిలారు నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. విజువల్ పరంగా సినిమాకి ప్రత్యేకంగా నిలిచేలా ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంగీతానికి ఎ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు.
Also Read : My Baby : ‘మై బేబీ’ సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ లాక్
ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్స్‌తో సినిమాపై అంచనాలు కూడా భాగా పెరిగిపోయ్యాయి. అయితే తాజాగా చిత్రబృదం నేడు సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా, ఈ మూవీలో ఆయన పాత్రకు సంబంధించిన పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్‌ను ‘పెద్ది’ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా విడుదలైన శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ సినిమాలోని అతని పాత్ర ఎంత బలమైనదో చూపించింది. మందపాటి హ్యాండిల్ బార్ మీసం, గంభీరమైన చూపుతో.. శివరాజ్ కుమార్ లుక్ అదిరిపోయింది. కాగా ఈ మూవీలో ఆయన ‘గౌర్నాయుడు’ పాత్రలో కనిపించనున్నారు.
