Site icon NTV Telugu

Shilpa shetty: ‘నా వల్ల మా అమ్మ చాలా కష్టాలు పడింది’

Shilpa

Shilpa

Shilpa shetty: పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి తాజాగా నటించిన చిత్రం ‘సుఖీ’. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.యాభై ఏళ్లు దగ్గర పడుతున్నప్పటికీ ఈ ముద్దు గుమ్మ తన అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూనే ఉంది. సుఖీ సినిమా దగ్గరలోనే విడుదల కాబోతుండటంతో టీం జోరుగా ప్రచారాలు మొదలుపెట్టింది. ఇక ఓ ఇంటర్వ్యూలో తాను పుట్టేటప్పుడు పడ్డ కష్టాల గురించి చెబుతూ ఈ ముద్దు గుమ్మ ఎమోషనల్ అయ్యింది. తాను పుట్టడానికే ఎన్నో కష్టాలు పడ్డాను అని తెలిపిన ఈ ముద్దుగుమ్మ తన వల్ల వాళ్ల అమ్మ చాలా కష్టపడిందని తెలిపింది. శిల్పా కడుపులో పడ్డప్పటి నుంచే వాళ్ల అమ్మకు ఎప్పుడూ రక్తస్రావం అవుతూ ఉండేదట. దీంతో అబార్షన్ చేయించుకోవాలని చెప్పిన వాళ్ల అమ్మ ఎంతో ధైర్యంతో తనని కన్నదని చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

Also Read: Miss shetty Mr polishetty: అమెరికాలో మిలియన్ కొట్టిన శెట్టీస్

తన బర్త్ స్ట్రగుల్ గురించి చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చిన శిల్పాశెట్టి.. ‘ నేను అనుకోకుండా ఈ భూమి మీద పడ్డాను. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే చచ్చి బతికాను. నేను కడుపులో పడ్డప్పటినుంచి మా అమ్మకు నిరంతరం రక్తస్రావం జరిగేదంటా. మా అమ్మ నా వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. దీంతో అమ్మకు ఏం కాకుండా ఉండాలంటే అబార్షన్ చేయాలని వైద్యులు సిఫార్సు చేశారు. ఇక నన్ను కోల్పోతున్నాననే ఆందోళనతో అమ్మ చాలా ఒత్తిడికి లోనైంది. కానీ,  దేవుని దయవల్ల నేను బతికి బయటపడ్డాను. మా అమ్మ ఎప్పుడూ ఏదో ఒక ప్రయోజనం కోసమే నేను ఇక్కడకు వచ్చానని చెబుతూ ఉంటుంది. అదే విషయాన్ని  ఆమె బలంగా కూడా నమ్ముతుంది’ అని తెలిపింది. ఇక శిల్పా శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సుఖీ సినిమా సెప్టెంబర్ 22న ఆన్ లైన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టా్ర్ లో విడుదల కానుంది. దీనిని సోనాల్ జోషి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో కుషా కపిల, దిల్నాజ్ ఇరానీ, అమిత్ సాద్, చైతన్య చౌదరి కీలక పాత్రల్లో  కనిపించనున్నారు. ఇదొక కామెడీ డ్రామా

 

Exit mobile version