Site icon NTV Telugu

“శ్రీకారం” నిర్మాతలకు శర్వానంద్ లీగల్ నోటీసులు

Sharwanand sends legal notice to Sreekaram producers

యంగ్ హీరో శర్వానంద్ “శ్రీకారం” నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించారని తెలుస్తోంది. బి కిషోర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి గానూ ముందుగా 6 కోట్ల రెమ్యూనరేషన్ తో 50% లాభం తీసుకునేట్టుగా నిర్మాతలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడట శర్వా. అయితే సినిమా విడుదలకు ముందే అతనికి నాలుగు కోట్ల రూపాయలు చెల్లించారు. మిగిలిన రెండు కోట్ల రూపాయలకు పోస్ట్-డేటెడ్ చెక్కులు ఇచ్చారట. అయితే ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయట. దీంతో శర్వానంద్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. మరి ఈ వివాదాన్ని “శ్రీకారం” నిర్మాతలు, శర్వాతో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకుంటారా ? లేదంటే లీగల్ గానే ముందుకు వెళ్తారా అనేది చూడాలి.

Exit mobile version