శర్వానంద్ తదుపరి చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. టీజర్ పరిశీలిస్తే కనుక ఈ సినిమా కథ శర్వానంద్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. తన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తండ్రిని ఒప్పించి, పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో.. అతని జీవితంలోకి మాజీ ప్రియురాలు అకస్మాత్తుగా ప్రవేశిస్తుంది. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య చిక్కుకున్న శర్వా పడే పాట్లు, ఆ క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి.
Also Read: Dhurandhar : పాకిస్థాన్’లో ధురంధర్ పైరసీ రికార్డ్
శర్వానంద్ తనదైన కామిక్ టైమింగ్‌తో అదరగొట్టారు. పాస్ట్ (గతం) లో మాస్ లుక్‌తో, ప్రజెంట్ (వర్తమానం) లో క్లాస్ లుక్‌తో వైవిధ్యం చూపించారు. శర్వా ప్రెజెంట్ ప్రేమికురాలిగా సాక్షి వైద్య, ఎక్స్గా సంయుక్త పోటాపోటీగా నటించారు. వీరిద్దరి మధ్య శర్వా నలిగిపోయే సీన్లు నవ్వులు పూయిస్తున్నాయి. సీనియర్ నటుడు నరేష్, కామెడీ స్టార్స్ సత్య, సునీల్, సుదర్శన్ తమదైన కామెడీతో సినిమాకు బలాన్ని చేకూర్చారు. సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.
Also Read:Pawan Kalyan – NTR : ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ‘పర్సనాలిటీ రైట్స్’ పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్‌ని ఇచ్చింది. ముఖ్యంగా కేరళ లొకేషన్లు వెండితెరపై కనువిందు చేస్తున్నాయి. విశాల్ చంద్ర శేఖర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని హ్యూమర్‌ని మరింత ఎలివేట్ చేసింది. ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 14వ తేదీన సాయంత్రం 5:49 గంటలకు ఫస్ట్ షోతో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.
