టాలీవుడ్ హీరో శర్వానంద్ కి ప్రత్యేక పరిచయం అక్కరలేదు, ఇప్పటికే ఫ్యామిలీ హీరోగా ఈ మంచి ఇమేజ్ సంపాదించుకున్న శర్వానంద్ తాజాగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఈరోజు ఓమీ, (OMI) పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేశారు, ఇది కేవలం ఒక బ్రాండ్ కాదని, భవిష్యత్తు తరాలకు సంబంధించి ఇది ఒక విజన్ కి ప్రారంభం అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఓమీతో సిన్సియారిటీ, మంచి ఉద్దేశాలు, బాధ్యతలతో కూడిన కొత్త చాప్టర్ ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా క్రియేటివిటీ, యూనిటీ, సస్టైనబులిటీ మెయింటైన్ చేస్తూ 100% నాచురల్ స్టోరీస్ ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు.
Also Read:Sathyan Sivakumar: 500 ఎకరాల ఆస్తికి వారసుడు ఈ తమిళ నటుడు, ఒక్క తప్పుతో అంతా నాశనం..
ఇప్పటి వరకు చెప్పని కథలను తన సంస్థ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తానని శర్వానంద్ ప్రకటించారు. ఈ సంస్థ నటులను, క్రియేటివ్ మైండ్స్ ను ఒకచోట కలిపే సంస్థగా ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా సినిమాలు, సినిమా నిర్మాణాలు మాత్రమే కాకుండా, ఈ సంస్థ ఆరోగ్యాన్ని, ప్రకృతికి దగ్గరగా ఉండే జీవితాన్ని మళ్లీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని ప్రకటించారు. ఇక ఈ సంస్థను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ప్రారంభించారు.
