ఈ ఏడాది తమిళ్ సినిమా ఇండస్ట్రీలలో వచ్చిన బిగ్ బడ్జెట్ సినిమాలలో భారతీయుడు 2 ఒకటి. 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం భారతీయుడు కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించగా యంగ్ హీరో సిద్ధార్థ్ మరో ముఖ్య పాత్రలో దర్శనమిచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా అటు నిర్మాతలకు ఇటు సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్స్ కు దారుణ నష్టాలు మిగిల్చింది.
Also Read : Zebra : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన జీబ్రా.. ఎక్కడంటే..?
ఇండియన్ – 2 సినిమా కథను కొన్ని కారణాల వలన రెండు భాగాలుగా తీసుకువస్తున్నామని శంకర్గతంలో ప్రకటించాడు. కానీ ఇండియన్ 2డిజాస్టర్ తో ఇక సీక్వెల్ ను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేస్తారు అని విపరీతమైన చర్చ నడిచింది. పార్ట్ -2 సమయంలోనే పార్ట్ -2 కు సంబంధించి మెజారిటీ షూట్ చేసేయడంతో ఓటీటీ రిలీజ్ చేసి పార్ట్ -2 నష్టాలలో కొంత మేర రికవరీ చేసుకోవచ్చని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు అప్పట్లో గాసిప్ లు వినిపించాయి. అయితే తాజాగా దర్శకుడు శంకర్ ఈ గాసిప్స్ కు చెక్ పెడుతూ ఇండియన్ -3 తప్పకుండా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది. త్వరలోనే ఇండియన్ -3 షూటింగ్ చేస్తామని అని రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అయితే రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు శంకర్.