కరోనా ప్యాండమిక్ ఎంత వీలైతే అంత డిస్టబ్ చేసేసింది బాలీవుడ్ ని. ఆ క్రమంలోనే నెక్ట్స్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయిన బిగ్ బడ్జెట్ మూవీ ‘సూపర్ సోల్జర్’. కత్రీనా సూపర్ హీరోగా సాహసాలు చేసే ఈ థ్రిల్లర్ మూవీ 2021లో సెట్స్ మీదకి వెళ్లాలి. రెండు భాగాలుగా భారీ ఖర్చుతో సినిమాని ప్లాన్ చేశాడు డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్. కానీ, లాక్ డౌన్ వల్ల అంతా తలకిందులైంది. అందుకే, కత్రీనా ‘సూపర్ సోల్జర్’ ఇప్పుడు 2022కి వాయిదా పడింది. ఆ లోపు ‘టైగర్ జిందా హై’ ఫేం అలీ అబ్బాస్ మరో సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ ఈ ‘వన్ నైట్ థ్రిల్లర్’లో హీరోగా కనిపించనున్నాడు…
అలీ అబ్బాస్ ఓ ఫారిన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఇండియన్ ఆడియన్స్ కు తగ్గట్టుగా మార్పుచేర్పులు చేసి రీమేక్ చేయబోతున్నాడు. అయితే, ఆ సినిమా పేరు, ఇతర వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు. కాకపోతే కథ మాత్రం ఒకే ఒక రాత్రిలో కొనసాగుతుందట. అందులో హీరోగా నటించేందుకు షాహిద్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
అలీ అబ్బాస్ జఫర్ థ్రిల్లర్ మూవీ కంటే ముందు తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే సారథ్యంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు షాహిద్ కపూర్. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఆ సిరీస్ షూటింగ్ కాగానే ‘కబీర్ సింగ్’ స్టార్ అలీ అబ్బాస్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడట. ఇక మన తెలుగు చిత్రం ‘జెర్సీ’ హిందీ రీమేక్ కూడా ఇప్పటికే షాహిద్ పూర్తి చేశాడు. హిందీ ‘జెర్సీ’ కూడా త్వరలో విడుదల కావాల్సి ఉంది…
