డ్రాగన్ ఎంత త్వరగా ఫినీష్ చేద్దామంటే అంత వెనక్కు వెళుతోంది. వార్2 వల్ల ఆలస్యంగా సెట్స్‌పైకి వెళ్లిందనుకుంటే, తారక్ మేకోవర్ కోసం మరింత టైమ్ తీసుకున్నాడు. వీటికి తోడు హీరో అండ్ డైరెక్టర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయన్న కామెంట్స్ వినిపించాయి. ఆ ఎఫెక్ట్ రిలీజ్ డేట్‌పై పడిందన్న బజ్. అన్ని సవ్యంగా సాగుతున్న టైంలో తారక్ గాయపడంతో షూటింగ్‌కు బ్రేక్‌లు పడ్డాయి.
గాయాల నుండి కోలుకున్న తారక్.. త్వరలో సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి షూట్ రీ షెడ్యూల్ కాబోతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడట ప్రశాంత్ నీల్. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే మారథాన్ షెడ్యూల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే 70 పర్సంట్ షూటింగ్ ఫినీషయ్యిందట. ఈ షూటింగ్ కన్నా ముందే డోంట్ టబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేయబోతున్నాడు తారక్. అక్టోబర్లో మొదలయ్యే షెడ్యూల్లో బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ కూడా పాల్గొనే ఛాన్స్ ఉందని టాక్. గతంలో విలన్ రోల్ కోసం టొవినోను ఫైనల్ చేశారు. కానీ కాల్షీట్స్ ఖాళీ లేక కాదనడంతో షాహీద్‌ను ఫైనల్ చేశారని బజ్. రీసెంట్లీ హైదరాబాద్‌లో షాహీద్‌పై లుక్ టెస్ట్ జరిగిందని టాక్. షాహీద్ ఉన్నాడా లేదా..? యాంటోగనిస్టు లేదా కీ రోల్ పోషిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. షాహీద్‌ను తీసుకొస్తే.. బాలీవుడ్ మార్కెట్‌కు యూజ్ అవుతాడని నీల్ ఈ ప్లాన్ చేస్తున్నాడు. ఇక మిగిలిన 30 శాతం షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. ఎట్టిపరిస్థితుల్లో నెక్ట్స్ ఇయర్ జూన్ 11కి డ్రాగన్‌ను తీసుకురావాలనుకుంటున్నారు మేకర్స్.

