Site icon NTV Telugu

Shah Rukh Khan : ‘కింగ్’ మూవీ కి బ్రేక్.. షూటింగ్‌లో షారుఖ్‌కు గాయాలు..?

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో సిద్ధార్థ్ ఆనంద్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షారుఖ్‌తో పాటు.. ఆయన కుమార్తె సుహానా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్‌లో తాత్కాలిక బ్రేక్ పడిందనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Also Read : Vishvambhara : విశ్వంభర ట్రోల్స్‌కి.. ట్రైలర్‌తోనే సమాధానం ఇస్తా..

తాజా సమాచారం మేరకు, షూటింగ్ సమయంలో షారుఖ్‌కు గాయమైందని, ఆయనకు వైద్యులు ఒక నెల పాటు విశ్రాంతి సూచించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ యాక్షన్‌ సన్నివేశంలో డూప్‌ లేకుండా స్టంట్‌ చేస్తుండగా ఆయనకు గాయాలైనట్లు కథనాలు పేర్కొన్నాయి. అది తీవ్రమైన గాయం కాదని, కండరాల గాయం అని వర్గాలు తెలిపాయి. దీంతో ప్రస్తుతం జరుగుతోన్న ‘కింగ్‌’ షూటింగ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేసినట్లు కూడా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే    “కింగ్” సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న నేపథ్యంలో.. ఈ బ్రేక్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. షారుఖ్ త్వరగా కోలుకొని సెట్స్‌పైకి తిరిగి వచ్చేస్తాడనే ఆశతో అభిమానులు ప్రర్థనలు చేస్తున్నారు.. దీనిపై మూవీ టీం నుండి అప్ డేట్ రావాల్సి ఉంది.

Exit mobile version