కమల్ “విక్రమ్” కోసం నేషనల్ అవార్డు విన్నింగ్ స్టంట్ మాస్టర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్ కాంబినేషన్ లో “విక్రమ్” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుంది. ‘జల్లికట్టు’ ఫేమ్ గిరీష్ గంగాధరన్ ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందించే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం కోసం నేషనల్ అవార్డు విన్నింగ్ స్టంట్ కో-ఆర్డినేటర్స్ ద్వయాన్ని రంగంలోకి దించుతున్నారు మేకర్స్. ఈరోజు లోకేష్ ట్విట్టర్ లో కమల్ తో పాటు నేషనల్ అవార్డు గెలుచుకున్న స్టంట్ కో-ఆర్డినేటర్స్ ద్వయం అన్బరివ్‌తో కలిసి ఉన్న పిక్ ను ట్వీట్ చేస్తూ వారిని ప్రాజెక్ట్ లోకి స్వాగతించారు. కెజిఎఫ్ చాప్టర్ 1 లో ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీకి జాతీయ అవార్డును గెలుచుకున్న అన్బరివ్, “విక్రమ్”లో కొన్ని హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను రూపొందించనున్నారు. ఇది అవుట్-అండ్-అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పుడు తమిళనాడు అంతటా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “విక్రమ్” ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూట్ కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది.
Also Read
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు