NTV Telugu Site icon

Costume Krishna: సీనియర్‌ నటుడు కాస్ట్యూమ్‌ కృష్ణ ఇకలేరు..

Castum Krishna

Castum Krishna

Costume Krishna: సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ ఇవాళ కన్నుమూశారు. చెన్నైలో అనారోగ్యంతో కాస్ట్యూమ్ కృష్ణ తుది శ్వాస విడిచారు. కాస్ట్యూమ్ కృష్ణ ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా లక్కవరపు కోట. కాస్ట్యూమ్ కృష్ణ నటుడిగా తొలి సినిమా భారత్‌ బంద్ సినిమాలో నటుడిగా పరిచయం అయ్యారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లో నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తాత గా తండ్రిగా అనేక పాత్రల తో మెప్పించారు. నిర్మాతగా 8 సినిమాలు నిర్మించారు. కాస్ట్యూమ్ కృష్ణ మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణ వార్త వినడానికి బాధగా ఉంది, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని దిల్ రాజు తెలిపారు.

Read also: Love Fraud: నన్ను మోసాడు.. రోడ్డుపై ప్రియురాలు రచ్చ మామూలుగా చేయలేదండోయ్‌

సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ సీనియర్ నటుడు, కాస్ట్యూమ్స్ కృష్ణ అనతికాలంలోనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నారు. రామానాయుడు సంస్థలో పూర్తిస్థాయి కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. లెక్కలేనన్ని సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి కథానాయికలకు కాస్ట్యూమ్స్ అందించి సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. అంతేకాకుండా.. ఆయన ఘట్టమనేని కృష్ణ హీరోగా అశ్వద్దామ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. దీంతో పెళ్లాం చెప్తే వినాలి, మా ఊరు మారాడు, పుట్టింటికి రా చెల్లి వంటి చిత్రాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అయితే అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో జేబులో కాసుల వర్షం కురిసింది.

అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో కాస్ట్యూమ్స్ కృష్ణకు పెళ్లిపందిరి సినిమా రూపంలో చేదు అనుభవం ఎదురైంది. పెళ్లిపందిరి సినిమాకు పబ్లిసిటీ అవసరం లేదని, సినిమా హిట్ కావాలంటే మౌత్ పబ్లిసిటీ సరిపోతుందని భావించిన కృష్ణ, సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు భయపడి ఈ విషయాన్ని చిత్ర హీరో జగపతిబాబుకు చెప్పాడట. కానీ పబ్లిసిటీ అవసరం లేదు సార్ అని కృష్ణ అన్నారు. కానీ కొందరు మాత్రం పబ్లిసిటీ కోసం 2 లక్షలు అప్పు ఇస్తాం.. సంతకం చేస్తే చాలు అంటూ ముందుకు వచ్చారు. జగపతిబాబు కూడా ఈ రుణానికి సంబంధించి ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో.. ఆయనను నమ్మి కృష్ణ రెండు సంతకాలు పెట్టాడు.

పెద్దగా చదువుకోని కృష్ణకు తమిళం, తెలుగు తప్ప వేరే భాష తెలియదు. దీంతో ఆయన సంతకం పెట్టిన మొదటి కాగితంలో “కాస్ట్యూమ్స్ కృష్ణకి బయ్యర్లు 2 లక్షలు అప్పు ఇచ్చినట్టు” ఉండగా, ఇక..మరో కాగితంలో “కాస్ట్యూమ్స్ కృష్ణ దగ్గర నుంచి పెళ్లిపందిరి సినిమాకి సంబంధించిన నెగిటివ్ రైట్స్ బయ్యర్లు కొన్నట్లు ఉంది. అయితే..ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న కృష్ణ తనని నమ్మకంలో మోసం చేశారని బాధపడ్డారట. అంతేకాకుండా.. సినిమాలపై విరక్తి పుట్టి చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు. ఇక అప్పడే ఆయన చెన్నైలోని ఓ అపార్ట్మెంట్ లో సాధారణ జీవితం గడుపుతున్న ఆయన ఇవాళ చెన్నైలోనే తన నివాసంలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.