Site icon NTV Telugu

మామిడి పండ్లు అమ్మిన సీనియర్ నటుడు…. !!

Naresh

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ మామిడి పండ్లు అమ్మారు. పైగా సినిమాల్లో తనకు వచ్చే అత్యధిక పారితోషికం కన్నా ఇలా పండ్లు అమ్మిన సంపాదనే బాగుందని అంటున్నారు. ఈ నటుడు గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో వ్యవసాయం స్టార్ట్ చేశారు. ఇలా రైతుగా మారిన తనకు వ్యవసాయం చేయడం చాలా సంతోషంగా ఉందట. అతను తన పొలంలో పండించిన మామిడి పండ్లను ఇటీవలే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమందికి విక్రయించి రూ.3,600/- సంపాదించాడు.

Read Also : సంక్రాంతి రేసులో “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్?

ఈ విషయాన్ని తెలుపుతూ నరేష్ ట్వీట్ చేశారు. “నరేష్ అనే రైతు తాను స్వయంగా పండించిన సేంద్రీయ మామిడి పండ్లను సహా నటులకు తన స్టూడియోలో రూ.50కి కిలో అమ్మి, రూ.3600 సంపాదించాడు. నాకు నటుడిగా అత్యధిక పారితోషికం అందుకున్నప్పటి కంటే ఇప్పుడే చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా వ్యవసాయంలోని నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి ప్రయతినించండి” అని ట్వీట్ చేశాడు. ఇక ఈ సీనియర్ నటుడు టాలీవుడ్ లోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

Exit mobile version