మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వాయిదా పడింది. అయితే సినిమా విడుదల వాయిదా పడడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదని మేకర్స్ రీజన్స్ చెప్పారు. కానీ అసలు కారణం అది కాదట. సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ రేటు చెప్పాడట నిర్మాత. అయితే ఇటీవల గోపీచంద్ ట్రాక్ రికార్డు, కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనడానికి పెద్దగా ఆసక్తిని కనబర్చలేదట. దీంతో నిర్మాత సినిమా రిలీజ్ ను వాయిదా వేశాడట. తాజా అప్డేట్ ప్రకారం ‘సీటిమార్’ను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు నిర్మాత ఓటిటి ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నాడు. డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సాధ్యమైన మొత్తానికి విక్రయించాలని నిర్మాత అనుకుంటున్నాడట. సరైన ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటిస్తున్నారు. భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలకపాత్రల్లో కన్పించనున్నారు.
ఓటిటిపై ‘సీటిమార్’ మేకర్స్ ఆశలు…?
