Site icon NTV Telugu

“తిమ్మరుసు” స్టైలిష్ లుక్… ప్రోమో సాంగ్ కోసమట!

Satyadev and Priyanka Pic from Thimmarusu Promo Shoot

సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం “తిమ్మరుసు”. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణ సంస్థలపై మహేష్ కోనేరు, యరబోలు సృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాంచరన, ప్రియాంక జవాల్కర్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. 2019లో వచ్చిన కన్నడ చిత్రం ” బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని “ని రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇది 2017లోని కొరియన్ మూవీ “న్యూ ట్రయల్” ఆధారంగా రూపొందించబడింది. ‘తిమ్మరుసు’కి సంబంధించిన అన్ని పనులు పూర్తి కావడంతో జూలై 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన స్టిల్ బయటకు వచ్చింది.

Read Also : తండ్రి అయిన కోలీవుడ్ స్టార్… ఎమోషనల్

సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ ఈ చిత్రం కోసం ఒక ప్రోమో సాంగ్ కోసం చిత్రీకరణంలో పాల్గొంటున్నపుడు తీసిన పిక్ అది. ఇందులో సత్యదేవ్, ప్రియాంక ఇద్దరూ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ఇక కోవిడ్ -19 సెకండ్ వేవ్ తరువాత తెరపైకి రానున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. కాగా సత్యదేవ్ ఇటీవల “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య” చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాడు. మరోవైపు ‘కిర్రాక్ పార్టీ’ తరువాత శరణ్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ‘తిమ్మరుసు’ కావడం విశేషం.

Exit mobile version