టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..హీరోగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వరుస సినిమాలలో నటించి మెప్పించాడు. సత్యదేవ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కృష్ణమ్మ.ఈ సినిమాలో అథిరా రాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు.అలాగే కాలభైరవ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.కృష్ణమ్మ సినిమాను అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు.ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఓకేసులో సత్యదేవ్‌ను అన్యాయంగా ఇరికిస్తారు అయితే ఆ కేసు నుంచి అతడు ఎలా బయటపడ్డాడు. ఇంతకు ఆ కేసు ఏమిటి .. అతడినే ఎందుకు ఇరికించారు అనేది ఈ సినిమా కథ. ట్రైలర్ లో కథ నడకకైనా, నది నడకకైనా మలుపులే అందం.కానీ కొన్ని మలుపుల్లో సుడులు ఉంటాయ్..అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి .ఈ సినిమాలో సత్యదేవ్ ఎంతో అద్భుతంగా నటించాడు..ఈ సినిమాతో సత్యదేవ్ కమర్షియల్ హిట్ అందుకుంటాడా లేదో చూడాలి..
