ZEE5 ఎప్పుడూ కూడా డిఫరెంట్ కంటెంట్, విభిన్న చిత్రాల్ని, సిరీస్‌లను అందిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘సట్టముమ్ నీతియుమ్’ ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లోకి రాబోతోంది. జూలై 18 నుంచి ఆల్రెడీ తమిళ వర్షన్ ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్లు ప్రకటించారు.
Also Read : Kingdom : కింగ్డమ్ ఓవర్శీస్ రివ్యూ..
శక్తివంతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలు, భావోద్వేగంతో కూడిన ఘర్షణలతో నిండిన ఈ సిరీస్ ఆగస్టు 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘సట్టముమ్ నీతియుమ్’ను బాలాజీ సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ సిరీస్‌ను.. 18 క్రియేటర్స్ బ్యానర్‌పై శశికళ ప్రభాకరన్ నిర్మించారు. ఆగస్టు 1న తెలుగు, హిందీ భాషల్లోకి ఈ సిరీస్ రాబోతోన్న తరుణంలో.. నటుడు శరవణన్ మాట్లాడుతూ .. ‘‘సట్టముమ్ నీతియుమ్’ కథ విన్న వెంటనే అది నా మనసును తాకింది. ఇది రెగ్యులర్ కోర్ట్ డ్రామా కాదు. ఈ కథ సామాన్యుడి బలం గురించి మాట్లాడుతుంది. ధైర్యంగా నిలబడి పోరాడే ఓ కామన్ మెన్‌ను చూపిస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులో నేను భాగం అవ్వాలని కథ విన్న వెంటనే నిర్ణయించుకున్నాను. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ఓ శక్తివంతమైన పాత్ర పోషించారు. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చిన దర్శకుడు బాలాజీ సెల్వరాజ్‌కు, జీ ఫైవ్ టీంకి నేను కృతజ్ఞుడను. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
జీ ఫైవ్ తమిళ, మళయాల బిజినెస్ హెడ్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ మార్కెటింగ్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ .. ‘ జీ ఫైవ్ లో మేము నిరంతరం వినోదాత్మకంగానే కాకుండా సామాజికంగా ముఖ్యమైన కథలను కూడా అందించడానికి ప్రయత్నిస్తాము. ‘సట్టముమ్ నీతియుమ్’తో న్యాయం, సత్యం వంటి అంశాలతో సామాజిక కథను అందించాం. ఆల్రెడీ తమిళంలో మా సిరీస్‌కు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు తెలుగు, హిందీ ప్రేక్షకుల ముందుకు మా సిరీస్ రాబోతోంది. అందరినీ మెప్పించేలా మా సిరీస్ ఉంటుంది’ అని అన్నారు. ఈ సిరీస్ ఆగస్టు 1 నుంచి ZEE5 తెలుగు, హిందీ భాషల్లో ప్రసారం కానుంది.
