Horror Movie on OTT: తరతరాలను వెంటాడే ఆ భయంకర దుష్టశక్తి… ఊహించని ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేస్తున్న హారర్ థ్రిల్లర్

Sathan The Dark

Sathan The Dark

Horror Movie on OTT: ఈ రోజుల్లో ఓటీటీలలో ప్రేక్షకులు థ్రిల్లర్ కంటెంట్‌ను తెగ చూస్తున్నారు. అందులోనూ హారర్ కంటెంట్‌ను మరింత ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే మేకర్స్ కూడా తమ మేకింగ్ స్టైల్‌తో సినీ ప్రియులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓటీటీల పుణ్యమా అని వివిధ భాషల్లో తెరకెక్కిన హారర్ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి వదులుతుండటంతో, కంటెంట్ క్లారిటీతో, ఆకట్టుకునే విధంగా ఉంటే ఇక్కడి ప్రేక్షకులు కూడా భయపడుతూనే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఓ తమిళ హారర్ థ్రిల్లర్ సినీ ప్రేక్షకులను అదరగొడుతూ.. ఊహించని ట్విస్ట్‌లతో, మైండ్ బ్లాక్ చేస్తోంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో హస్తినాపురం అనే గ్రామంలో విఫలమైన ఒక క్షుద్రపూజ చుట్టూ ఈ సినిమా కథ ఉత్కంఠంగా సాగుతుంది. మరి ఆ సినిమా పేరు? మరిన్ని వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఓటీటీలో ఆడియన్స్‌ని మైండ్ బ్లాక్ చేస్తున్న ఈ తమిళ హారర్ థ్రిల్లర్ పేరు ‘సతన్ ది డార్క్’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. నిజానికి ఈ సినిమా ఒకటి రెండు ఓటీటీలలో కాదు, ఏకంగా మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8నుంచి, ఆహా తమిళ్, టెంట్ కోట్టాలో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మణికంఠన్ రామలింగం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ మూవీ 2026 మార్చి 27న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. విడులైనయిప్పటి నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇక్కడ కూడా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో ఎఫ్.జె (FJ), ఐరా, చాందిని తమిళరసన్, మోన బెద్రే, శ్రీజ రవి లీడ్ రోల్స్‌లో నటించగా, ఎడ్వర్డ్ రాజన్ ఈ సినిమాని నిర్మించారు.

స్టోరీ ఇదే
ఈ సినిమా కథ చాలా కాలం నాటి ఒక భయంకరమైన శాపం చుట్టూ తిరుగుతుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో, హస్తినాపురం అనే గ్రామంలో కొందరు క్షుద్రపూజలు చేస్తారు. అయితే ఆ పూజ విఫలమవ్వడంతో అక్కడొక దుష్ట శక్తి పుడుతుంది. ఆ శాపం వల్ల ఆ ఊరి జనాలు తరాల తరబడి ఘోరమైన ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఊరిని, అక్కడి మనుషులను ఆ క్షుద్ర శక్తులు వదలకుండా వెంటాడుతూనే ఉంటాయి. కట్ చేస్తే.. ప్రెజెంట్ జనరేషన్‌లో ఒక సాధారణ యువకుడు తన లవర్‌తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే అనూహ్యంగా ఆ దుష్ట శక్తి ఇతని ప్రియురాలిని చుట్టుముడుతుంది. అప్పుడు ఆమె ప్రాణాలు డేంజర్‌లో పడతాయి. తన ప్రేయసిని ఆ దెయ్యాల నుంచి కాపాడుకోవడానికి ఆ యువకుడు హస్తినాపురం గ్రామంలోని ఆ దుష్టశక్తి చీకటి శక్తులను ఎలా ఎదిరించాడు? చివరికి ఆ శాపాన్ని అంతం చేసి తన ప్రియురాలి ఎలా దక్కించుకున్నాడు? అనేదే తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.