Horror Movie on OTT: తరతరాలను వెంటాడే ఆ భయంకర దుష్టశక్తి… ఊహించని ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేస్తున్న హారర్ థ్రిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Horror Movie on OTT: ఈ రోజుల్లో ఓటీటీలలో ప్రేక్షకులు థ్రిల్లర్ కంటెంట్‌ను తెగ చూస్తున్నారు. అందులోనూ హారర్ కంటెంట్‌ను మరింత ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే మేకర్స్ కూడా తమ మేకింగ్ స్టైల్‌తో సినీ ప్రియులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓటీటీల పుణ్యమా అని వివిధ భాషల్లో తెరకెక్కిన హారర్ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి వదులుతుండటంతో, కంటెంట్ క్లారిటీతో, ఆకట్టుకునే విధంగా ఉంటే ఇక్కడి ప్రేక్షకులు కూడా భయపడుతూనే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఓ తమిళ హారర్ థ్రిల్లర్ సినీ ప్రేక్షకులను అదరగొడుతూ.. ఊహించని ట్విస్ట్‌లతో, మైండ్ బ్లాక్ చేస్తోంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో హస్తినాపురం అనే గ్రామంలో విఫలమైన ఒక క్షుద్రపూజ చుట్టూ ఈ సినిమా కథ ఉత్కంఠంగా సాగుతుంది. మరి ఆ సినిమా పేరు? మరిన్ని వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఓటీటీలో ఆడియన్స్‌ని మైండ్ బ్లాక్ చేస్తున్న ఈ తమిళ హారర్ థ్రిల్లర్ పేరు ‘సతన్ ది డార్క్’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. నిజానికి ఈ సినిమా ఒకటి రెండు ఓటీటీలలో కాదు, ఏకంగా మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8నుంచి, ఆహా తమిళ్, టెంట్ కోట్టాలో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మణికంఠన్ రామలింగం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ మూవీ 2026 మార్చి 27న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. విడులైనయిప్పటి నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇక్కడ కూడా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో ఎఫ్.జె (FJ), ఐరా, చాందిని తమిళరసన్, మోన బెద్రే, శ్రీజ రవి లీడ్ రోల్స్‌లో నటించగా, ఎడ్వర్డ్ రాజన్ ఈ సినిమాని నిర్మించారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
స్టోరీ ఇదే
ఈ సినిమా కథ చాలా కాలం నాటి ఒక భయంకరమైన శాపం చుట్టూ తిరుగుతుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో, హస్తినాపురం అనే గ్రామంలో కొందరు క్షుద్రపూజలు చేస్తారు. అయితే ఆ పూజ విఫలమవ్వడంతో అక్కడొక దుష్ట శక్తి పుడుతుంది. ఆ శాపం వల్ల ఆ ఊరి జనాలు తరాల తరబడి ఘోరమైన ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఊరిని, అక్కడి మనుషులను ఆ క్షుద్ర శక్తులు వదలకుండా వెంటాడుతూనే ఉంటాయి. కట్ చేస్తే.. ప్రెజెంట్ జనరేషన్లో ఒక సాధారణ యువకుడు తన లవర్‌తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే అనూహ్యంగా ఆ దుష్ట శక్తి ఇతని ప్రియురాలిని చుట్టుముడుతుంది. అప్పుడు ఆమె ప్రాణాలు డేంజర్లో పడతాయి. తన ప్రేయసిని ఆ దెయ్యాల నుంచి కాపాడుకోవడానికి ఆ యువకుడు హస్తినాపురం గ్రామంలోని ఆ దుష్టశక్తి చీకటి శక్తులను ఎలా ఎదిరించాడు? చివరికి ఆ శాపాన్ని అంతం చేసి తన ప్రియురాలి ఎలా దక్కించుకున్నాడు? అనేదే తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..