Site icon NTV Telugu

SVP Pre Release : మేనల్లుడి మాటలకు మురిసిపోయిన మహేశ్‌..

Galla Ashok

Galla Ashok

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, అందాల నటి కీర్తి సురేష్‌ జంటగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్ యూసఫ్‌గూడాలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. అయితే ఈ వేడుకకు డైరక్టర్లు అనిల్‌ రావిపూడి, సుకుమార్, వంశీ పైడిపల్లి, బుచ్చిబాబు, గోపిచంద్‌ మలినేనితో పాటు హీరో సుధీర్‌ బాబు, తదితరులు హజరయ్యారు. వీరితో పాటు ఇటీవల హీరో సినిమాతో తెరగేట్రం చేసిన మహేశ్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ కూడా ఈ ప్రీ రిలీజ్‌ ఈ వెంట్‌లో సందడి చేశారు.

అయితే ఈ వేడుకల్లో వేదికపై.. గల్లా అశోక్‌ మాట్లాడుతూ.. మా మామ సూపర్‌ స్టార్‌ అనుకునే వాడినినని.. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసిందే.. ముందుగా మీకందరికీ సూపర్‌ స్టార్‌ అని.. అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని.. ట్రైలర్‌, పాటలు చూస్తే కనిపిస్తుందన్నారు. అయితే మేనల్లుడి మాటలకు మహేశ్‌ మురిసిపోయి చప్పట్లు కొట్టడం.. అందరినీ ఆకర్షించింది.

https://www.youtube.com/watch?v=OtnfbfBxDPI

Exit mobile version