NTV Telugu Site icon

Nani: సరిపోదా శనివారం పోస్టర్స్ డే కాన్సెప్ట్ అదిరింది..మీరు ఓ లుక్కేయండి..

Untitled Design (2)

Untitled Design (2)

నేచురల్ నాచురల్ స్టార్ నాని హీరోగా తమిళ పొన్ను ప్రియాంక మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ సినిమా “సరిపోదా శనివారం”. ఈ మూవీ పోస్ట‌ర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. సరికొత్త కథాంశం, వివేక్ ఆత్రేయ అద్భుతమైన టేకింగ్ తో రానున్న ఈ చిత్ర ట్రైలర్ sj సూర్య బర్త్ డే స్పెషల్ గా విడుదల చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా నుంచి తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. శనివారం ఈ చిత్రం పోస్టర్స్ డే సెలెబ్రేషన్స్ అంటూ సరికొత్త ప్రమోషన్స్ కు తెరలేపారు యూనిట్. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలు, అవి పోషించే నటీనటుల పేర్లుతో పాటుగా ఈ చిత్రంలో ఆ పాత్రల లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాలో ఛాయాదేవి అనే పాత్ర‌లో న‌టి అభిరామి నటిస్తోంది, శంకరం పాత్రలో ప్రముఖ నటులు సాయి కుమార్, భద్ర పాత్రలో నటి అతిధి బాలన్,గోవర్ధన్ గా నటుడు అజయ్, కమలాకార్ పాత్రలో శుభలేఖ సుధాకర్, సుధా రోల్ లో హర్షవర్షన్, నారాయణ ప్రభగా అజయ్ ఘోష్ నటిస్తున్నట్టు తెలియజేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసింది సరిపోదా శనివారం టీమ్.

కాగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు నిర్మాత దానయ్య. ప్రతీ శనివారం సరికొత్త అప్ డేట్స్ తో ఆడియన్స్ లో హైప్ పెంచేలా వినూత్నంగా ప్లాన్ చేసింది DVV బ్యానర్. ఆగస్టు నెలాఖరున విడుదల కానున్న ఈ చిత్రానికి జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు

Also Read :August Release: ఎవరొచ్చినా రాకున్న సరే ఆ సినిమా తగ్గేదేలే..ఏమిటా సినిమా..!

Show comments