NTV Telugu Site icon

Nani : వామ్మో.. అక్కడ నాని సినిమాకు కలెక్షన్స్ మాములుగా లేవుగా

Untitled Design 2024 08 18t104355.226

Untitled Design 2024 08 18t104355.226

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సరిపోదా శనివారం’. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. కథాబలం ఉండే సినిమాలు తెరకెక్కించే వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తమిళ నటుడు SJ. సూర్య విలన్ గా నటిస్తున్నాడు ఇటీవల రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ ఆగస్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు ఏర్పాట్లు పూర్తి చేసారు మేకర్స్.

Also Read: Chiyan Vikram : వారెవా.. విక్రమ్.. టాలీవుడ్ ఆడియన్స్ కోసం..?

కాగా సరిపోదా శనివారం అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ఓవర్సీస్ బుకింగ్స్ అదరగొడుతున్నాయి. నాని కెరీర్ లోనే అత్యంత వేగంగా 50కే డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్ వసూళ్లను రాబట్టి 1 మిలియన్ దిశగా దూసుకువెళుతుంది ఈ సినిమా. రిలీజ్ కు ఇంకా చాలా రోజులు ఉండగా ఈ కలెక్షన్స్ సాధించడం ఈ సినిమాకు ఆడియన్స్ లో క్రేజ్ ఎలా ఉందొ తెలియజేస్తుంది. వారంలో 6 రోజులు శాంతంగా ఉంది ఒక్క శనివారం మాత్రమే కోపంగా ఉంటూ శత్రువులను అంతమొందించే కథాంశంతో ‘ సరిపోదా శనివారం’ రానుంది. మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు నాని. ఇందుకిలో భాగంగా ఇటీవల చెన్నైలో ఈ సినిమా తమిళ వర్షన్ ట్రైలర్ రిలీజ్ చేసాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై DVV దానయ్య నిర్మించిన ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించారు. త్వరలోనే ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు మేకర్స్.

Show comments