NTV Telugu Site icon

Saripodhaa Sanivaaram: రచ్చ రేపేలా ‘సరిపోదా శనివారం’.. ట్రైలర్ అదిరింది బాసూ!!

Saripoda Sanivaram

Saripoda Sanivaram

Saripodhaa Sanivaaram Trailer Talk: నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ఈ యాక్షన్-అడ్వెంచర్‌ సినిమా ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు సుదర్శన్ 35 MM థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇక టీజర్ సినిమాలోని రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేయగా, ట్రైలర్ కాన్ఫ్లిక్ట్ ని ప్రజెంట్ చేసింది. దాన్ని బట్టి చూస్తే సీఐ దయానంద్ చిన్న చిన్న కారణాలతో ఇతరులపై దాడి చేసే క్రూరమైన వ్యక్తి. సాధారణ మధ్యతరగతి కుర్రాడైన సూర్య తన చుట్టూ ఉన్నవారికి అన్యాయం జరిగితే సహించలేడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటెన్స్ వార్ ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఇక వివేక్ ఆత్రేయ 2.0 అనేలా ఈ ట్రైలర్ ఉంది. గ్రిప్పింగ్ ట్రైలర్ ఇంపాక్ట్ ఫుల్ స్టొరీ మెయిన్ పార్ట్ ని రివిల్ చేస్తోంది.

Janhvi Kapoor: శ్రీదేవి పుట్టినరోజు.. తిరుమలలో ప్రియుడితో కలిసి మోకాళ్లపై జాన్వీ సాష్టాంగ నమస్కారం

మొదటి నుండి చివరి వరకు ఆడియన్స్ ని కట్టిపడేసింది. నెరేటివ్ అదిరిపోయింది, పెర్ఫార్మెన్స్,టెక్నికల్ వాల్యూస్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయనే చెప్పాలి. నాని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆదరగొట్టారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం అనిపించేలా ఉంది. ఎస్‌జె సూర్య డైనమిక్ పాత్రలో కనిపించారు. ప్రియాంక మోహన్ నాని క్యారెక్టర్ ప్రేమలో ఉన్న కానిస్టేబుల్‌గా ఆకట్టుకుంది. ఇక మురళి జి సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, జేక్స్ బిజోయ్ తన అద్భుతమైన స్కోర్‌తో నెరేటివ్ ని ఎలివేట్ చేశారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారనిపిస్తోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఈ విజిల్-వర్తీ ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది.

Show comments