NTV Telugu Site icon

Saranga Dariya: భారతీయుడు 2 రిలీజ్ రోజే రాజా రవీంద్ర ‘సారంగదరియా’

Saarangadaria

Saarangadaria

Saranga Dariya Pre Release Event: రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న మూవీ ‘సారంగదరియా’. ఈ సినిమాను భారతీయుడు సినిమా రిలీజ్ అయ్యే రోజే జూలై 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. హీరో నిఖిల్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్‌ను కోనుగోలు చేశారు.

Bharateeyudu 2: భారతీయుడు దిగుతున్నాడు.. తెలుగు సెన్సార్ వివరాలివే!

ఈ ఈవెంట్‌లో న‌టుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ తగ్గేదేలే సినిమాకు నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేశాను. ఆ చిత్రానికి పండు డైరెక్షన్‌‌ డిపార్ట్మెంట్ లో పని చేశాడు. మా డైరెక్టర్ సినిమా గురించి ట్రైలర్‌లోనే మొత్తం చెప్పేసి ఫెయిల్యూర్ అనేది చాలా డేంజరని చూపించాడు. ఈ సినిమాలో నాకు ముగ్గురు కొడుకులుంటారు, ఒక్కొక్కరికి ఒక్కో సమస్యలుంటాయని అన్నారు. కాలేజ్ లెక్చరర్‌గా పని చేసి అందరికీ నీతులు చెబుతా, కానీ నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతా అని అన్నారు. సోషల్ మీడియా, ప్రస్తుత బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య రిలేషన్ సరిగ్గా ఉండటం లేదన్న ఆయన కలిసి కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. ఇలాంటి టైంలో పిల్లలు చెడు బాట పట్టొచ్చని, పిల్లలకు తల్లిదండ్రులు మోరల్ సపోర్ట్ ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని అన్నారు.

Show comments