సెలబ్రెటీలకు రిలేషన్స్, డెటింగ్, బ్రెకప్ లు కామన్. చెప్పాలంటే ఎక్కువగా స్టార్ కిడ్స్ కొంతమంది ఎప్పుడూ ఎదో విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వారి పెంపకంలో ఎలాంటి కట్టుబాట్లు ఉండవు. ఇందులో భాగంగా తాజాగా సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ శుభమాన్ గిల్ గత కొన్ని సంవత్సరాలుగా, సారా టెండూల్కర్ తో లవ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ, వీరిద్దరూ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. కానీ ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారని రూమర్స్ కూడా వినిపించాయి. ఇక తాజాగా.. ఇప్పుడు సారా కొత్త కుర్రాడిని పట్టినట్టు తెలుస్తోంది.
Also Read: Lokesh : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ డైరెక్టర్..?
అవును బాలీవుడ్ లో ఓ రూమర్ వైరల్ అవుతుంది. పవర్ఫుల్ యాక్టర్ రైజింగ్ స్టార్ సిద్దాంత్ చతుర్వేది.. సారా టెండూల్కర్ తో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ అనేక సందర్భాల్లో కలిసి కనిపించారు. దీంతో బి-టౌన్ లో సరికొత్త ప్రేమ పక్షులు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందాతో సిద్ధాంత్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గతంలో పుకార్లు రావడంతో, ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ దీనిపై సిద్ధాంత్, నవ్య ఇద్దరూ ఎప్పుడూ పెదవి విప్పకుండానే ఉన్నారు. సోషల్ మీడియాలో వీరి ప్రేమ వ్యవహారం పై కోడై కూసింది. మళ్ళీ ఇప్పుడు సిద్దాంత్ చతుర్వేది తో సారా అంటూ వీరిద్దరిపై వార్తలు వినపడుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.
