Site icon NTV Telugu

Market Mahalakshmi: ‘మార్కెట్ మహాలక్ష్మి’ నుంచి “సాఫ్ట్‌వేర్ పోరగా” సాంగ్ రిలీజ్

కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు.వినూత్న ప్రమోషన్లతో సినిమా సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు మేకర్స్ ఈ చిత్రం యొక్క మొదటి పాట “సాఫ్ట్‌వేర్ పోరగా” లిరికల్ వీడియోను ఆవిష్కరించారు. మన మార్కెట్ మహాలక్ష్మి ప్రణీకాన్విక మనసుని గెలుచుకోవాలనే తపనతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పార్వతీశం చేసిన ప్రయత్నాలను ఈ సాంగ్ ద్వారా వివరిస్తుంది.

Also Read: Ambajipeta Marriage Band OTT: ఓటీటీలో దుమ్ముదులిపేస్తున్న సుహాస్ మూవీ…

మార్కెట్‌ నుండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న హీరో, అతను ఎదుర్కొనే పరిస్థితులు ఎంతో ఆహ్లాదకరంగా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ ‘విఎస్ ముఖేష్’ రాసిన పదాలు, జో ఎన్ మవ్ గ్రూవీ బీట్‌లు మరియు లోకేశ్వర్ ఎడార యొక్క ఎనర్జిటిక్ వాయిస్ ఈ క్రేజీ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇది ప్రేక్షకులను ఖచ్చితంగా అలరింప చేస్తుంది. ఈ సాంగ్ రాబోయే రోజుల్లో వైరల్ గా అయ్యే అవకాశం పుష్కలంగా కనబడుతున్నాయి.సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కి, కూరగాయల వ్యాపారి కి మధ్య జరిగే ప్రేమకథే ఈ చిత్రం. అతి త్వరలో థియేటర్లలో సినిమా సందడి చేయనుంది.

Exit mobile version