Site icon NTV Telugu

Sanyuktha Menon: అఖండ2లో సంయుక్తమీనన్‌ హీరోయిన్నా? ఐటంగర్లా?

Sanyuktha

Sanyuktha

సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో నటిస్తూ, ప్రస్తుతం తొమ్మిది సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న హీరోయిన్ సంయుక్త మీనన్ త్వరలో ఫేడౌట్ అవుతుందనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైంది. ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ, కెరీర్ మసకబారుతుందా అన్న భయం ఈ అమ్మడిని వెంటాడుతోంది. ఈ విచిత్రమైన పరిస్థితులకు కారణం ఏమిటి? సాయి పల్లవి, నిత్యా మీనన్ తరహాలో ఇంతకాలం గ్లామర్‌కు దూరంగా, నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు ఎంచుకున్నారు సంయుక్త. ‘సార్’ (తెలుగులో వాతి) సినిమాలో టీచర్‌గా డిగ్నిఫైడ్ రోల్‌లో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే, బాలయ్య సినిమాతో సంయుక్త రూటు మారింది. అఖండ 2 లో బాలయ్యతో జత కట్టడమే కాక, ఐటమ్ గర్ల్‌గా కూడా కనిపించబోతుండడం ఈ భయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జాజికాయ సాంగ్‌లో సంయుక్త స్కిన్‌షో చేయడం బాలయ్య చేతిలో పడి యూటర్న్ తీసుకున్నట్టుగా అయ్యిందనే చర్చ నడుస్తోంది.

Also Read :Naga Bandham : కుర్ర హీరో సినిమా కోసం 20 కోట్ల క్లైమాక్స్?

హీరోయిన్స్ ఎవరైనా బాలకృష్ణతో నటిస్తే, ఆ సినిమా హిట్టైనా హీరోకి, డైరెక్టర్‌కి మాత్రమే పేరు వస్తుందని, హీరోయిన్‌కు మరో ఆఫర్ దక్కడం కష్టమేననే ఒక ‘సెంటిమెంట్’ టాలీవుడ్‌లో బలంగా ఉంది. చాలామంది దర్శకులు కెరీర్ చివరి స్టేజ్‌లో ఉన్న లేదా ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్లను మాత్రమే బాలయ్య పక్కన సెలెక్ట్ చేస్తున్నారనే విమర్శ ఉంది. ‘భగవంత్ కేసరి’ హిట్టయినా, కాజల్‌కు మరో పెద్ద ఆఫర్ దక్కలేదు.’లెజెండ్’, ‘లయన్’ సినిమాల్లో బాలయ్యకు జంటగా నటించిన తర్వాత రాధికా ఆప్టే కనిపించకుండా పోయారు. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ అయినా, ఆ హిట్ ప్రగ్యా జైస్వాల్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. ‘డాకు మహారాజ్’ తర్వాత ఊర్వశి రౌతేలా కూడా తెరపై కనిపించలేదు. క్రేజీ భామగా కొనసాగుతున్న సంయుక్త మీనన్ కూడా ‘అఖండ 2’ తర్వాత ఇదే సెంటిమెంట్‌కు బలైపోతుందా, లేదా ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. బాలయ్యతో జత కట్టడం సంయుక్త కెరీర్‌ను మసకబారేలా చేస్తుందా, లేక మరింత హైప్‌ను తెస్తుందా అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Exit mobile version