ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ‘పేపర్ బాయ్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘ఏక్ మినీ కథ’ అనే కామెడీ ఎంటర్టైనర్ లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు బాణీలు సమకూరుస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు విడుదల వాయిదా పడింది. కానీ ‘ఏక్ మినీ కథ’ మేకర్స్ మాత్రం ధైర్యంగా కరోనాను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. ‘ఏక్ మినీ కథ’ను ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇది వరకే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. కాగా ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, బహ్మాజి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.