NTV Telugu Site icon

Sankranthiki Vasthunam Trailer: ఇంట్లో ఇల్లాలు పోలీస్ స్టేషన్లో ప్రియురాలు.. వెంకటేష్ హిట్ ఫార్ములా!

Sankrantiki Vastnnam Traile

Sankrantiki Vastnnam Traile

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక సినిమా ట్రైలర్ ను పరిశీలిస్తే ముందుగా ఒక హై ప్రొఫైల్ వ్యక్తి కిడ్నాప్ అవుతాడు. ప్రభుత్వ పెద్దలు అందరూ ఆలోచించి మాజీ పోలీసు అధికారి అయిన వెంకటేష్ ను హెల్ప్ అడిగి ఆ కిడ్నాప్ అయిన వ్యక్తిని విడిపించాలి అని కోరతారు. అయితే పోలీస్ ఉద్యోగం మానేసి తన భార్య ఐశ్యర్య రాజేష్ తో హ్యాపీ లైఫ్ గడుపుతూ ఉంటాడు.

Sankranthiki Vasthunam Trailer: పండుగ ముందే తెచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’

అయితే ఈ ఆపరేషన్ కోసం వెంకటేష్ మాజీ ప్రేయసి మీనాక్షి చౌదరి రంగంలోకి దిగడంతో ఐశ్వర్య కూడా తాను ఈ ఆపరేషన్ కోసం వస్తానంటుంది. వెంకటేష్ లైఫ్ లోకి వచ్చాక భార్య, మాజీ ప్రేయసి మధ్యలో వెంకటేష్ పాత్ర ఎలా నలిగింది? ఆ కిడ్నాప్ కథ ఎలా సుఖంఠం అయింది అనేది సినిమా కథగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ముందు నుంచి భిన్నంగా చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి హిట్ అని మూవీ టీం గట్టిగా ప్రమోట్ చేస్తోంది.

Show comments