NTV Telugu Site icon

Sankranthiki Vasthunam: సంక్రాంతి సినిమాల్లో ‘వస్తున్నాం’ ప్యూర్ డామినేషన్..

Sankranthiki

Sankranthiki

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్టర్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ దెబ్బకి ఖచ్చితంగా ఫ్యామిలీస్ అన్నీ ఈ సినిమా చూడాలి అన్నట్టు ముందే ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నారు. అందుకే ఈ సినిమా ఊహించని విధంగా ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్న షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా థియేటర్లకు జనాన్ని రప్పించడానికి ఇబ్బంది పడుతున్న బీ,సీ సెంటర్లలో ఉన్న కొన్ని పాత థియేటర్లకు సైతం హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. అవి కూడా అడ్వాన్స్గా.

Mani Sharma: సురేష్ కొండేటి “అభిమాని” సినిమాకి మణిశర్మ రీ – రికార్డింగ్

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్ సినిమాలు ప్రదర్శిస్తున్న ధియేటర్లలో సైతం ఉదయం 6 గంటలకు సంక్రాంతికి వస్తున్నాము షోస్ వేసే ఆలోచనలో థియేటర్లో యాజమాన్యాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో గేమ్ చేంజర్ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. డాకు మహారాజ్ కి మొదటి ఆట నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం కి కూడా దాదాపు అదే టాక్ రావడంతో పాటు ఫ్యామిలీస్ అందరూ అట్రాక్ట్ అవడంతో ఈ సినిమా ఓపెనింగ్ డే భారీగా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు వెంకటేష్ కెరియర్ లోనే ఇది అత్యధిక వసూళ్లు రాబట్టే సినిమాగా నిలిచిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు.

Show comments