తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి ఒక గోల్డెన్ సీజన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు దాదాపుగా బ్రేక్ ఈవెన్ అవుతాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆ సినిమాలు అన్నింటినీ ప్రేక్షకులు చూసి ఆదరిస్తారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే నిర్మాతలు కర్చీఫ్ లు వేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ కూడా చేశారు. మరోపక్క చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న అనిల్ రావిపూడి సినిమా కూడా సంక్రాంతికి కన్ఫర్మ్ అయింది.
Jr NTR : నీల్ తరువాతి ప్రాజెక్ట్ సెట్?
రావిపూడి సంక్రాంతికి మంచి సెంటిమెంట్ ఉండడంతో కచ్చితంగా ఆ సినిమాని అదే సంక్రాంతి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మరొక పక్క నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రూపొందుతున్న అనగనగా ఒకరోజు సినిమాని కూడా సంక్రాంతికి దించే ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఇవి కాకుండా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా ఫైనల్ అయింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బానర్ మీద ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నారు. ఈ సినిమాని కూడా వచ్చేయడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇక మరొక పక్కన వెంకటేష్ దాదాపు 20 కథలు విన్న తర్వాత సురేందర్ రెడ్డికి లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ నల్లమలపు బుజ్జి బ్యానర్లో సినిమా చేసేందుకు గ్రీన్ సింగర్ ఇచ్చారు. ఆయన కూడా ఈ సినిమాని సంక్రాంతికి తీసుకొచ్చే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.