NTV Telugu Site icon

సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా పేదలకు ఆహరం , సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ!

sanjana galrani help to needy people due to covid-19

‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహరం, శాండల్ వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు తాను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “కోవిడ్‌ బాదితులు మెరుగైన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలను పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నేను ఉడతా భక్తిగా మే 10 నుండి ఇంటి సెల్లార్ లోనే వంట వండించి రోజు 500 మందికి రెండు పూటలా వెజిటేబుల్ బిర్యానీ, పెరుగన్నం, పులిహోర, పెరుగన్నం , బిష్బిళ్ళ బాత్, పెరుగన్నం ఇలా రోజు మెనూ మారుస్తూ పేదవారికి ఆహరం అందిస్తున్నాను. అదేవిధంగా లాక్ డౌన్ కారణంగా రోజు వారి కూలికి పనిచేసే సినీ పరిశ్రమకు చెందిన లైట్ బాయ్స్ , ప్రొడక్షన్ ఫోర్త్ క్లాస్ కార్మికులకు 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను జూన్ 2న అందించాను. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సహాయాలను కొనసాగిస్తాను” అని తెలిపింది.