Site icon NTV Telugu

Kishkindhapuri Villian: చిన్నపుడు 150 రూపాయలకి రోడ్లపై డాన్స్ చేశా!

Sandy Master

Sandy Master

తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన శాండీ మాస్టర్, ఇటీవల కొత్త లోక సినిమాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి సినిమాలో విలన్ పాత్రలలో అలరించాడు. తాజాగా కిష్కింధపురి ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు మీడియాతో మాట్లాడిన ఆయన, తాను చిన్నప్పటి నుంచే పని చేయడం మొదలుపెట్టానని అన్నాడు. చిన్నప్పుడు స్ట్రీట్ డాన్సర్‌గా పని చేసేవాడిని, ఒక రోజు సుమారు 50 నుంచి 60 పాటలకు డాన్స్ చేసేవాడిని అన్నారు.

Also Read : OG : ఓజి ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టిన ప్రియాంక మోహన్

అలా డాన్స్ చేసినందుకు గానూ తనకు 150 రూపాయలు ఇచ్చేవారని, ఆ డబ్బుతో తన ఇంటికి చేదోడు వాదోడుగా ఉండేవాడిని అన్నారు. ఇక తనకు నటనతో పాటు సినిమాను డైరెక్ట్ చేయాలనే ఆలోచన కూడా ఉందని, కాకపోతే ప్రస్తుతానికి కొరియోగ్రఫీతో పాటు నటనతో బిజీగా ఉన్నాను కాబట్టి, కాస్త తనకు సమయం దొరికినప్పుడు దర్శకత్వం మీద ఫోకస్ చేస్తానని అన్నాడు. ఇక కిష్కింధపురిలో శాండీ మాస్టర్ చేసిన పాత్రకు, ఆ పాత్రలో అతని నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ పాత్రలో అదరగొట్టాడని అంటున్నారు.

Exit mobile version