Site icon NTV Telugu

Sigma : సందీప్ కిషన్ ‘సిగ్మా’లో కేథరీన్ స్పెషల్ సాంగ్

Catherine Tresa

Catherine Tresa

లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సిగ్మా’ (Sigma) అనే భారీ యాక్షన్-అడ్వెంచర్ కామెడీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సందీప్ కిషన్ హీరో పాత్ర పోషిస్తున్నారు. యూత్ వైబ్‌తో, బిగ్ స్కేల్‌లో రూపొందుతున్న ‘సిగ్మా’ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్‌గా మారుతోంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా, మగలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిథి పాత్రలు కూడా ఉండటం విశేషం.

Also Read :Pragathi : టాలీవుడ్’కి ప్రౌడ్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్‌లో పవర్ లిఫ్టింగ్ కోసం నటి ప్రగతి ఎంపిక

సినిమాలో స్పెషల్ అట్రాక్షన్‌గా, హీరోయిన్ కేథరీన్ థ్రెసా హీరో సందీప్ కిషన్‌తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లు, నేపథ్య స్కోర్‌లకు పేరుగాంచిన ఎస్. థమన్, ఈ పాట కోసం ఒక పవర్ ఫుల్ ట్రాక్‌ను కంపోజ్ చేశారు. ఇది సినిమాకి ఒక హైలైట్‌గా ఉంటుందని నిర్మాతలు హామీ ఇస్తున్నారు. భారీ, కలర్‌ఫుల్ సెట్‌లో చిత్రీకరించబడిన ఈ పాటలో సందీప్ కిషన్, కేథరీన్ థ్రెసా హై-ఎనర్జీ డ్యాన్స్‌తో స్క్రీన్‌ను ఉర్రూతలూగించనున్నారు.

Also Read :Rajamouli Avatar 3: సర్‌ప్రైజ్‌కు ప్లాన్ చేసిన జక్కన్న.. ‘అవతార్‌ 3’లో వారణాసి ఆట!

ఈ కథ అంతా తనదైన దారిలో నడిచే ‘సిగ్మా’ అనే ఒక మావెరిక్ హీరో చుట్టూ తిరుగుతుంది. అతని పట్టుదల, సహనం, ఎవరూ ఊహించని పద్ధతుల్లో ఎదగడం ప్రేక్షకులకు థ్రిల్‌నిస్తుంది. యంగ్ డైనమిక్ దర్శకుడు జేసన్ సంజయ్ సెన్సిబిలిటీలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. ఈ మల్టీ లింగ్విల్ ప్రాజెక్ట్ తమిళం, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరించబడింది. చెన్నై, తలకోన అడవులు, మరియు థాయిలాండ్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో షూటింగ్ జరిగింది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ బిగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ 2026 వేసవిలో (సమ్మర్) ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version