NTV Telugu Site icon

Samudrudu : కలెక్షన్స్ లో 20 శాతం మత్స్యకారుల జీవనానికి అందిస్తాం..

Samududu

Samududu

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  హీరో సుమన్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు.  ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు వి. సముద్ర గారు మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి ప్రసన్నకుమార్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు వి. సముద్ర గారు మాట్లాడుతూ : సముద్రుడు టైటిల్ దర్శకుడు నగేష్ నన్ను చూసి పెట్టడం జరిగింది. రమాకాంత్ మంచి హీరో అవుతాడని తారకరత్న గారు ఎప్పుడో చెప్పారు. ఆ మాటని నిజం చేస్తూ ఈరోజు రమాకాంత్ హీరోగా సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది.

హీరో సుమన్ గారు మాట్లాడుతూ “సముద్రుడు సినిమా జాలర్ల జీవితాలపై ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు నగేష్ చాలా బాగా తీశాడు. ప్రేక్షకులకు ఈ సినిమా ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరో రమాకాంత్ మాట్లాడుతూ : మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలు దర్శకుడు వి. సముద్ర గారికి టి. ప్రసన్నకుమార్ గారికి అలాగే మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. చత్రపతి ఎంత పెద్ద విజయం సాధించిందో ఈ సముద్రుడు సినిమా కూడా అంతే విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను.

దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ : ఈ సినిమా జాలర్ల జీవితాన్ని చూపించే డాక్యుమెంటరీ ఫిలిం లా కాకుండా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసిన ఒక మంచి సినిమా. సముద్రం దగ్గర ఉండే జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళినప్పుడు పడే కష్టాలు వాళ్లకు వచ్చే సమస్యల్ని ఈ చిత్రంలో చూపించడం జరిగింది.