ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా ‘పుష్ఫ ది రైజ్’ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ఈ సినిమాలో సమంత అభినయించిన ‘ఊ అంటావా’ సాంగ్ కూడా ఆ రేంజ్ లోనే రికార్డులు సృష్టించింది. దాదాపు ఈ సినిమా వచ్చి 8 నెలలవుతున్నా ఈ పాటపై క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. య్యుట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇతర రీల్స్‌లల్లో ఊ అంటావా సాంగ్‌కు ప్రముఖులు సైతం కాలు కదిపారు. అయితే.. తాజాగా ఈ పాటకు సంబంధించి మరో ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది.
ఇటీవల ఫ్లోరిడాలో క్రికెట్ స్టేడియంలో.. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఐదవ T20I మ్యాచ్ జరిగింది. అయితే.. ఈ స్టేడియంలో ‘ఊ అంటావా’ సాంగ్ ట్రాక్ ప్లే చేయడంతో స్టేడియంలో ఆటగాళ్లు డాన్స్‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే.. ప్రస్తుతం సమంత్ ‘శాకుంతలం’, ‘యశోద’, ‘ఖుషి’ మరియు ‘సిటాడెల్’ వంటి పెద్ద ప్రాజెక్ట్‌లతో బిజీబిజీగా ఉంది.
Oo Antava song at Central Broward Park & Broward County Stadium
Lauderhill, Florida#INDvsWI #AlluArjun #Pushpa pic.twitter.com/X0a9My0h5h— RAM (@VodkaTweetz) August 7, 2022
