సమంత ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లో నిలిచింది. దానికి కారణం ఆమె ఇటీవల చేసిన ‘శుభం’ అనే సినిమా. ఈ సినిమాకు రాజ్ నిడుమూరు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. నిజానికి రాజుతో సమంత రిలేషన్‌లో ఉందనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. సమంత కూడా రాజుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తాను ఇక మూవ్ ఆన్ అవుతున్నట్లు హింట్ ఇస్తోంది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా రాజు భార్య ఒక పోస్ట్ పెట్టిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
Also Read:Jayam Ravi: భార్య అరాచకంపై జయం రవి సంచలన ఆరోపణలు
నిజానికి ఆ పోస్ట్ ఆమె ఇప్పుడు పెట్టినది కాదు, ఏప్రిల్ మూడవ తేదీన పెట్టింది. కానీ, తాజాగా సమంత రాజుతో కలిసి ఒక ఫోటో షేర్ చేయడంతో ఆ పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. రాజ్ నిడుమూరు భార్య పేరు శ్యామలీ డే. వీరిద్దరికి 2017లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. సైకాలజీలో డిగ్రీ చేసిన శ్యామలీ, విశాల్ భరద్వాజ్, రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా వంటి వారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. అంతేకాదు, ‘రంగ్ దే బసంతి’, ‘ఓంకార’ సహా కొన్ని సినిమాలకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరించింది.
Also Read: Naga Chaitanya: నాగచైతన్య సినిమాకి అదిరే డీల్.. అమ్మేశారు!
గతంలో తమ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ సమయంలో, తన భార్య తనకు కాస్టింగ్ సలహాలు ఇచ్చేదని రాజ్ చెప్పుకొచ్చారు. “ఆమెకు సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల, ఎప్పుడూ మమ్మల్ని సెలబ్రిటీలుగా చూడకుండా సాధారణంగా చూసేది,” అని ఆయన అన్నారు. అయితే, సమంత నిజంగానే రాజ్ తో డేటింగ్ చేస్తోందా లేక స్నేహితులుగా ఉన్నారా అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ‘శుభం’ టీం తో పాటు రాజ్ నిడుమూరు తిరుమల వెళ్లడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, ఆయన కూడా ఒక టీం మెంబర్‌గా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అది పెద్ద విషయం కాదు. కానీ, ఆయన సినిమాలో భాగమైన విషయాన్ని బయటకు చెప్పేందుకు టీం పెద్దగా ఇష్టపడలేదు, ఎందుకో తెలియదు.
