Site icon NTV Telugu

Samantha: ప్రతి అమ్మాయికి అలాంటి బ్రదర్ ఉండాలన్న సమంత.. త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Jigra

Jigra

Samantha Speech At JIGRA Movie Pre Release Event:అలియా భట్ హీరోయిన్ గా నటించిన జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అలియా భట్, సమంత, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ , రాహుల్ రవీంద్రన్ వేదాంగ్ రైనా తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలో సమంత మాట్లాడుతూ హీరోయిన్స్ గా ఎంతో బాధ్యత ఉంటుంది అని, ప్రతి అమ్మాయి కథలో వారే హీరోలు అని అన్నారు. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చానని పేర్కొన్న ఆమె జిగ్రా మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి అని కోరుకుంటున్నానని అన్నారు. ఇక ప్రతి అమ్మాయికి రానా లాంటి బ్రదర్ ఉండాలి అని ఆమె కామెంట్ చేయగా దానికి రానా థంబ్ సింబల్ చూపారు.

Ram Charan -Prashanth Neel: దానయ్య సమర్పించు ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్?

ఇక తెలుగు ప్రేక్షకులే నా ఫ్యామిలీ అని మరోసారి సమంత చెప్పుకొచ్చింది. అయితే ఆసక్తికర అంశం ఏంటంటే సమంతపై త్రివిక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మాయ చేశావే నుంచే సమంత హీరో అని సమంతకు వేరే శక్తి అక్కర్లేదు, సమంతనే ఓ శక్తి అయిన్ అన్నారు. సమంత ముంబయిలోనే కాకుండా హైదరాబాద్ అప్పుడప్పుడు కూడా రండి, మీరు చేయడం లేదని మేం రాయడం లేదు, మీరు నటిస్తానంటే మేం రాస్తాం అని అన్నారు. అత్తారింటింటికి దారేది లాగా సమంత కోసం,హైదరాబాద్ కు రావడానికి దారేది అనాలేమో సమంత రావాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలి అని త్రివిక్రమ్ పేర్కొన్నారు.

Exit mobile version