NTV Telugu Site icon

Samantha: దర్శకుడితో సమంత డేటింగ్.. అర్ధాంగీకారం!

Samantha Raj Nidumoru

Samantha Raj Nidumoru

తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇండియా వైడ్ గా ఉన్న సినీ ప్రేక్షకులకు సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలుత తమిళ సినిమాలతో నటిగా మారిన ఆమె అతి తక్కువ సమయంలోనే తెలుగులో అవకాశం దక్కించుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత తన మొదటి సినిమాలో నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. తర్వాత పలు కారణాలతో ఈ జంట విడిపోయింది. తర్వాత నాగచైతన్య, శోభితను వివాహం చేసుకున్నాడు. సమంత మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా తన సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి అప్డేట్స్ ఇస్తూ పోతుంది. అయితే ఆమె దర్శకుడైన రాజ్ నిడుమోరు అలియాస్ రాజ్ తో ప్రేమాయణం నడుపుతోందని కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది.

Thief: సినీ నటితో ప్రేమలో పడిన దొంగ.. ఏకంగా రూ. 3 కోట్లతో ఇల్లు..

తర్వాత ఆ విషయం సద్దు మణిగింది. అయితే ఇటీవల ఆమె పికిల్ బాల్ అనే ఒక గేమ్ కి సంబంధించిన టీం కొనుగోలు చేసింది. తాజాగా ఆ టీం గేమ్ ఆడిన తర్వాత సమంత రాజ్ తో కలిసి చేతులు పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే ఈ అంశం మీద తెలుగు సహా బాలీవుడ్ లో ఉన్న అన్ని మీడియా అవుట్లెట్స్ లో వార్తలు వచ్చాయి. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు సమంత కాకపోయినా ఆమె టీం నుంచి అయినా ఖండన వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి ఖండన ఏదీ రాకపోవడంతో దాదాపుగా వారి రిలేషన్ ని ఆమె కన్ఫామ్ చేసినట్లేనని ప్రచారం జరుగుతోంది.. మౌనం అర్ధాంగికారం అని పెద్దలు అన్నట్టు నిజంగానే సమంత ఈ డేటింగ్ వ్యవహారాన్ని అంగీకరించినట్లే భావించాల్సి ఉంటుంది.