తనకు ఓ అభిమాని గుడి కట్టడంపై సమంత ఆసక్తికరంగా స్పందించింది. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్ 2023వ సంవత్సరంలో సమంత విగ్రహంతో ఒక గుడి కట్టి అప్పట్లో తెగ వైరల్ అయ్యాడు. తాజాగా “శుభం” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సమంతకి ఈ గుడికి సంబంధించిన ఓ ప్రశ్న ఎదురైంది. “ఈ గుడి నిర్మించడంపై మీ ఫీలింగ్ ఏంటి? గుడి నిర్మించిన వారిని మీరు కలిసారా?” అని అడిగితే, “ఇప్పటివరకు గుడి నిర్మించిన వారిని కలవలేదు. అలాగే ఇలా నామీద ప్రేమను చాటి చెప్పినందుకు సంతోషంగా ఉంది.
Read More: India Pakistan War: ఇండియా-పాకిస్థాన్ యుద్ధం వస్తే.. ఏయే రాష్ట్రాలు ప్రభావితమవుతాయి?
అతని ప్రేమను అగౌరవపరచాలని ఉద్దేశం లేదు, కానీ నేను ఇలా గుడులు కట్టడాన్ని ఎంకరేజ్ చేయలేను. అలా చేయడం నాకు ఇష్టం లేదు. ఇది సరైన కల్చర్ కాదు,” అంటూ ఆమె అభిప్రాయపడింది. సమంత నిర్మాతగా “శుభం” అనే సినిమా రూపొందింది. గతంలో “సినిమా బండి” అనే సినిమా డైరెక్టర్ చేసిన ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మే తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
